900-మెగావాట్ల సోలార్ పార్క్ ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్

- June 19, 2023 , by Maagulf
900-మెగావాట్ల సోలార్ పార్క్ ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్

యూఏఈ:  దుబాయ్‌లో ప్రారంభించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ సోలార్ పార్క్ తాజా దశ 270,000 గృహాలకు పవర్ ను అందజేస్తుంది. ఈ స్వచ్ఛమైన శక్తి సంవత్సరానికి ఒక మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అతని పేరు మీద ఉన్న సోలార్ పార్క్ 900-మెగావాట్ల (MW) ఐదవ దశను తాజాగా ప్రారంభించారు. Dh50 బిలియన్ల మొత్తం పెట్టుబడిని కలిగి ఉన్న మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోలార్ పార్క్ పూర్తయితే ఏటా 6.5 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.  ఫోటోవోల్టాయిక్ ప్యానెల్‌ల ఆపరేషన్,  నిర్వహణ కోసం ఆధునిక రోబోటిక్ క్లీనింగ్ సిస్టమ్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించిన మధ్యప్రాచ్యంలోని మొదటి ప్రాజెక్ట్‌లలో ఐదవ దశ ఒకటి. ఐదవ దశ మొత్తం వైశాల్యం దాదాపు 10 చదరపు కిలోమీటర్లు.

పునరుత్పాదక శక్తికి మారడానికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన చర్య తీసుకోవడం ద్వారా మానవాళి అందరికీ మరింత స్థిరమైన భవిష్యత్తును సృష్టించే ప్రపంచ ప్రయత్నాలలో UAE ముందంజలో ఉందని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అన్నారు.  2030 నాటికి పునరుత్పాదక వనరుల నుండి 25 శాతం, 2050 నాటికి 100 శాతం ఇంధన అవసరాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాలను సాధించడానికి దుబాయ్ స్పష్టమైన వ్యూహం,  మార్గాన్ని అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు.  సోలార్ పార్క్‌లో ప్రారంభించిన సౌరశక్తి ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 2,427 మెగావాట్లకు చేరుకుంది. దుబాయ్ మిక్స్‌లో క్లీన్ ఎనర్జీ వాటా 16 శాతానికి పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com