మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
- June 20, 2023
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడోతరం అడుగిడింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో, మెగా ఫ్యాన్స్‌లో సంబురాలు మిన్నంటాయి. మెగా ఫ్యాన్స్ అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకొని, ఆసుపత్రి బయట అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
రామ్ చరణ్ – ఉపాసనలు 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్న విషయం విధితమే. చాలాకాలం తరువాత వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. గతేడాది డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించాయి.
ఇదిలాఉంటే. ఉపాసన డెలివరీకోసం సోమవారమే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె వెంట రామ్ చరణ్, సురేఖ (చిరంజీవి సతీమణి) కూడా ఉన్నారు. కొన్నిరోజులు నుంచి రామ్ చరణ్ షూటింగ్స్ గ్యాప్ ఇచ్చారు. ఆగష్టు వరకు షూటింగ్స్‌లో పాల్గొనడని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే, బిడ్డ పుట్టిన తరువాత చరణ్ అండ్ ఉపాసన చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నట్లు ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గ్రాండ్ పేరెంట్స్ అయిన చిరంజీవి, సురేఖ సంరక్షణలోనే తమ బిడ్డని పెంచాలని భావిస్తున్నట్లు ఉపాసన ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







