ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం.. ముఠా అరెస్ట్
- June 20, 2023
యూఏఈ: నివాస అపార్ట్‌మెంట్‌లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఒక ఆసియా ముఠాను పట్టుకున్నట్టు ఉమ్ అల్ క్వైన్ పోలీస్ జనరల్ కమాండ్ యాంటీ నార్కోటిక్స్ విభాగం వెల్లడించింది. ఈ ముఠా అక్రమంగా మాదక ద్రవ్యాల సాగు, రవాణాలో ఉందన్నారు. యాంటీ నార్కోటిక్స్ విభాగం అధిపతి, మేజర్ జమాల్ సయీద్ అల్ కెత్బీ మాట్లాడుతూ.. ఈ కార్యకలాపాలకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందిందని, ఒక ప్రత్యేక బృందం ఆకస్మిక దాడి చేసి ముఠాను పట్టుకున్నట్టు తెలిపారు. ముఠా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ముఠా సభ్యులపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్టు తెలిపారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా సమాచారాన్ని నివాసితులు నేరాలను 80044లో "ముకాఫిహ్" కమ్యూనికేషన్ సర్వీస్ ద్వారా లేదా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్, MOI ద్వారా నివేదించవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







