దారుణంగా నష్టపోయిన ‘ఆదిపురుష్’.!
- June 22, 2023
ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కి, దారుణంగా విమర్శల పాలైన సినిమా ‘ఆదిపురుష్’. ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని డైరెక్ట్‌గా తెలుస్తున్నప్పటికీ చిత్ర యూనిట్, ట్రేడ్ వర్గాలు మాత్రం 300 కోట్లు, 400 కోట్ల వసూళ్లు.. అంటూ అనౌన్స్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు.
కానీ, అంత సీనూ సినిమా లేదు ‘ఆది పురుష్’కి. అందుకు పూర్తి భిన్నంగా వుంది పరిస్థితి. వసూళ్లు దారుణంగా పడిపోయాయ్. నార్త్‌లో కొంతవరకూ బెటర్. తక్కువ నష్టాలతోనే బయటపడొచ్చునంటున్నారు. కానీ, సౌత్ పరిస్థితి ఘోరంగా వుంది.
ఏదో పబ్లిసిటీతో అలా నెట్టుకొచ్చేస్తున్నారు. కానీ, నిర్మాతలు చెప్పుకోలేక, విప్పుకోలేక అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా ప్రబాస్ నుంచి ఇది మూడో సినిమా ఇలా నష్టాల్లో మునిగిపోవడం. దాంతో, ప్రబాస్ ఇమేజ్‌కి బాగా డ్యామేజ్ ఏర్పడిపోయింది. ఈ డ్యామేజ్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రబాస్ వున్నాడట.
అన్నట్లు వీకెండ్ స్పెషల్‌గా ‘ఆదిపురుష్’ సినిమా టిక్కెట్ల రేట్లను కూడా తగ్గించేశారట. అయినా ఈ సినిమాపై ఎవ్వరూ ఆసక్తి చూపించకపోవడం విశేషం.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







