రష్మిక బాలీవుడ్ ఆశలన్నీ ‘యానిమల్’ పైనే.!
- June 22, 2023
సౌత్‌లో వరుస సూపర్ హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ అనిపించేసుకున్న రష్మిక మండన్నా, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంది రష్మిక మండన్నా. అయితే, ఇంతవరకూ అక్కడ రష్మిక నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేశాయ్.
ఇక, మిగిలున్నది ‘యానిమల్’ సినిమా ఒక్కటే, రణ్‌బీర్ కపూర్ జోడీగా రష్మిక నటించిన ఈ సినిమా లేటెస్ట్గా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది.
ఈ సినిమా సక్సెస్ అయితేనే, బాలీవుడ్లో రష్మిక కెరీర్ నిలదొక్కుకున్నట్లవుతుంది. లేదంటే, అంతే సంగతి. అయితే, ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది రష్మిక మండన్నా.
ఇటు, తెలుగులో రష్మిక ‘పుష్ప 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీలోనూ రష్మిక నటిస్తోంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







