కువైట్ లో భానుడి భగభగలు

- June 23, 2023 , by Maagulf
కువైట్ లో భానుడి భగభగలు

కువైట్: కువైట్‌లో రాబోయే రోజుల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాత్రి ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గుతుందని చల్లని కబురు చెప్పింది. కువైట్ కాలానుగుణంగా వచ్చే భారతీయ అల్ప తరంగంతో పాటు దుమ్ము-ప్రేరేపించే వాయువ్య గాలుల వల్ల దృశ్యమానతను తగ్గిస్తుందని వాతావరణ మానిటర్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరావీ తెలిపారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత గరిష్ఠంగా 31-33 డిగ్రీలకు పడిపోవచ్చని, కాగా రాబోయే రెండురోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 47-49 డిగ్రీలకు పెరుగుతుందని, వీకెండ్ లో అవి 48-50 డిగ్రీలకు చేరుకుంటుందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,  వేడికి నేరుగా గురికావద్దని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com