రామ్-బోయపాటి డేట్ ఫిక్స్ చేసుకున్నారుగా.!

- June 23, 2023 , by Maagulf
రామ్-బోయపాటి డేట్ ఫిక్స్ చేసుకున్నారుగా.!

మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో రామ్ పోతినేని చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 
సెప్టెంబర్ 15న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఆల్ సెట్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని బోయపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
‘అఖండ’ సూపర్ హిట్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై సహజంగానే అంచనాలు నెలకొన్నాయ్.
ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో రామ్‌ని మాస్ ఊర మాస్ లుక్స్‌లో చూపించగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చుట్టూ పచ్చని పొలాల మధ్య వైట్ అండ్ వైట్ పంచెకట్టులో గుబురు గడ్డంతో వున్నప్పటికీ, రామ్ చాలా హ్యాండ్‌సమ్‌గా హోమ్లీగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com