ముంబయి లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ
- June 24, 2023
ముంబయి: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ముంబయి లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న నాలుగైదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముంబయి నగర వ్యాప్తంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జూన్ 26-27 తేదీల్లో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాయ్ గఢ్, థానే, పాల్ఘర్, ముంబై ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ముంబయి వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 11న రుతుపవనాలు తీరప్రాంతం రత్నగిరికి చేరుకున్నప్పటికీ.. బిపర్జాయ్ తుఫాను కారణంగా 10 రోజులు ఆలస్యంగా 23-25 తేదీల మధ్య రుతుపవనాలు నగరంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ ముందుగానే అంచనా వేసింది. కాగా, ఇన్ని రోజులు తీవ్ర ఉక్కపోతకు గురైన నగర వాసులు తాజా వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు ‘హ్యాపీ రెయినీ డే’ అంటూ వర్షానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







