ఆస్ట్రేలియా వాసి కృష్ణ నడింపల్లికు అత్యున్నత పురస్కారం

- June 24, 2023 , by Maagulf
ఆస్ట్రేలియా వాసి కృష్ణ నడింపల్లికు అత్యున్నత పురస్కారం

హైదరాబాద్: ఏదేశ మేగినా ఎందు కలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి ని అన్న రాయప్రోలు సుబ్బారావు గీతానికి కార్యరూపంలో ఆస్ట్రేలియా గడ్డ పై జాతి ఖ్యాతిని కృష్ణ నడింపల్లి చాటు తున్నారని ప్రముఖులు ప్రశంసించారు. రవీంద్రభారతి లోని సమావేశ మందిరంలో వంశీ ఆర్ట్స్ థియేటర్స్, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఏం. ఆర్.సి గ్రూప్ నిర్వ్యహణలో ఆస్టేలియా లో స్థిరపడిన కృష్ణ నడింపల్లి,లక్ష్మీ నడింపల్లి దంపతుల కు వంశీ గ్లోబల్ లెజెండరీ అవార్డు తో పాటు ఆదర్శ దంపతులు పురస్కార సభ జరిగింది. ముఖ్య అతిధిగా పురస్కారాలను బహు కరించి గోపాలాకృష్ణానంద. స్వామి పాల్గొని మాట్లాడారు విదేశాలలో ఉన్న తెలుగు వారు భారతీయ సంస్కృతికి రాయబారులు అన్నారు. కృష్ణ ప్రకృతి విపత్తుల నివారణ శాస్త్ర వేత్త గా ఆస్టేలియా దేశంలో గత ఇరవై వత్సరాలు గా ఆ దేశ ప్రగతి లో పాలు పంచుకొని అక్కడి  ప్రభుత్వం చే మెడల్ ఆఫ్ దే ఆర్డర్ ఆఫ్ ఆస్టేలియా సత్కారం పొందారని ఇది ప్రతి భారతీయుని కీ ముఖ్యం గా తెలుగు వారు అందరికి గర్వకారణం అన్నారు. ఆయన రానున్న రోజుల్లో ఆస్టేలియా చట్ట సభలకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు అధ్యక్షత వహించిన సాహితీ వేత్త వోలెటి పార్వతీశం మాట్లాడుతూ తెలుగు నాట మారు మూల గ్రామం లో పెద కుటుంబం నుంచి స్వయంకృషితో విదేశీ గడ్డ పై శాస్త్ర వేత్త గా ప్రభవించిన కృష్ణ జీవిత ప్రస్థానం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం అన్నారు స్వాగతం పలికిన వంశీ రామ రాజు ఆస్టేలియా లో కృష్ణ తెలుగు సంస్థలను ఐక్య పరచి పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వేదిక పై నిర్మాత ఏం. ఆర్.చౌదరి, డాక్టర్ తెన్నేటి సుధ, శైలజ తదితరులు పాల్గొన్నారు తొలుత కొండ్రాజు కృతి సాహిత్య భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com