ఇమేజ్ దెబ్బతినకుండా శరీరాకృతిని పొందటం ఎలా??
- May 13, 2016
పెళ్ళి కాకముందు పొట్ట లేకుండా అందంగా ఉండేదానివి, పెళ్ళైన తరువాత పిల్లలు పుట్టి ఇలా దిగిపోయిన కడుపుతో నువ్వేనా అన్నట్లు తయారయ్యావు'' అంటుంటారు చాలామంది కొంతమంది స్త్రీలని చూసి. "నాకు పెళ్ళైంది. పిల్లలున్నారు. ఇలా ఉండక పెళ్ళికాకముందులా - మెరుపు తీగలా ఎలా వుంటాను. అనే జవాబు కూడా వస్తుంటుంది అవతలి స్త్రీల నుంచి ఇది సాధారణం.కానీ ఇది సరైన సమాధానం కాదు. అటువంటి ఆడవాళ్ళు తమని తామే ప్రశ్నించుకోవాలి "ఇలా ఎందుకు మారిపోయాము'' అని. గర్భం ధరించినప్పుడు కడుపు గోడలు, చర్మం, కండరాలతో సహా పూర్తిస్థాయికి పొడిగించబడతాయి. ప్రసవం తరువాత కండరాలు మామూలు పరిమాణానికి వస్తాయి. కాని పొట్టమధ్యలో నిలువుగా రెండు కండరాలుం టాయి. మామూలుగా ఇవి కలిసివుంటాయి. గర్భం దరించినప్పుడు కడుపు సాగి, రెండూ దూరం అవుతాయి. ప్రసవం తరువాత మళ్ళీ అవిదగ్గరికి రావాలి. కానీ రావు. కొంతమందిలో కడుపుకు రెండువైపులా కండరాలు దూరంగా జరిగినప్పుడు మధ్యలో గాప్ ఏర్పడి, ఆ తరువాత అవి మళ్ళీ కలుసుకోక ఇంటస్టైనల్ హెర్నియాలు కలుగవచ్చు. ఆ గాప్‌లో కండబదులు పైబ్రస్ టిష్యూ ఏర్పడుతుంది. కానీ సాధారణంగా చర్మం సాగి వేలాడుతుండటం వల్ల మనకి పిల్లలు పుట్టిన స్త్రీలలో పొట్ట అలా కనిపిస్తుంది. ఆ వేలాడే చర్మం కొద్దిగా వున్నప్పుడు పట్టించుకోరు. పెద్దయ్యేకొద్దీ వెన్నునొప్పి రావడం, బరువు ఎక్కువై నడిచే విధానంలో మార్పు రావడం, పేగులు బయటికొస్తూ - హెర్నియాలు ఏర్పడినప్పుడు కంగారు పడతారు.ఇలాంటి ఆడవాళ్ళు, ఎక్కడైనా పనిచేస్తున్నవాళ్ళయితే ఉద్యోగస్థలానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. హెర్నియాలు అపాయకర దశకు చేరినప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్లు అవసరం అవుతాయి.వేరే ప్రదేశంలో శరీరాన్ని కోసి ఈ శస్త్రచికిత్సను జరుపం. అంతకుముందు వున్న మచ్చ ద్వారానే ఈ శస్త్రచికిత్సను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తాం. అంటే అబ్డామినోప్లాస్టీ వల్ల పొట్టమీద కొత్త గాయాపు మచ్చలేవి పడవు. ఈ పద్దతిలో వేల్లాడే స్కిన్‌ని తొలగించి లోపల లూజ్‌గా వున్న కండరాల్ని టైట్చేస్తారు. ఈ శస్త్రచికిత్స మొత్తం అంతకుముందున్న సిజేరియన్ మచ్చలోంచే చేస్తాం. ఇలా శస్త్రచికిత్స చేసేముందు అంబులికల్ హెర్నియాలాంటివుంటే వాటిని సరిచేస్తారు.కొన్ని సందర్భాల్లో ఎబ్డామినో ప్లాస్టీతో పాటు లైపోసక్క్షన్ ద్వారా కడుపులో అటుఇటూ, తొడల్లో, పిరుదుల్లో వున్న కొవ్వుని తగ్గించి శరీరాన్ని మొదట్లా తీర్చిదిద్దుతాం. ఈ శస్త్రచికిత్సకి ఎటువంటి రిస్క్లేదు. చాలా చిన్నది సురక్షితమైంది. ఈ శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు పూర్తిగా నయమయ్యేదాకా పొట్టచుట్టూ బెల్ట్ లాంటిది ధరించాల్సి ఉంటుంది.లైపోసక్షన్తోపాటు చేసినప్పుడు ఇది చాలా మంచి ఫలితాల్ని ఇస్తుంది. పబ్లిక్ స్థలాల్లో సంచరించే వాళ్ళకి ఇమేజ్ దెబ్బతినకుండా శరీరాకృతిని పొందటం అవసరం. కాబట్టి ఎబ్డామినల్ప్లాస్టీ అందుకు ఎంతగానో తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









