శరీరానికి నేచురల్ ప్రోటీన్స్ కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి.!
- June 26, 2023
శరీరం ఆరోగ్యంగా, రోజంతా చురుగ్గా వుండాలంటే వుదయాన్నే ప్రోటీన్లు అధికంగా వుండే ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ప్రొటీన్స్ ఫుడ్ అంటే ఏంటీ.?
పాలు, గుడ్లు వంటి ఆహార వుత్పత్తుల్లో ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. అందరికీ తెలిసిందే. అయితే, శనగపప్పులో అత్యధిక శాతం ప్రొటీన్ వుంటుదట. పచ్చి శనగలను వుడికించి తీసుకోవచ్చు. లేదంటే, శనగలతో చేసిన ఏ ఆహారమైనా ఆరోగ్యమే.
అయితే, శనగలతో పాటూ, బెల్లం కలిపి తీసుకుంటే, ఇంకా మెరుగైన ప్రయోజనాలుంటాయట. బెల్లంలో ఐరన్, కాల్షియంతో పాటూ ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా వుంటుంది. అలాగే శనగలతో కలిపిన బెల్లంను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలతో పాటూ, ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయట.
తద్వారా ఎముకలు ధృడంగా మారడంతో పాటూ, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంగా వుండేందుకు కూడా ఈ కాంబినేషన్ ఫుడ్ ఎంతో సహకరిస్తుంది. గుండె సంబంధిత అనేక సమస్యలు ఈ కాంబినేషన్ ఫుడ్‌ని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అధిగమించొచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







