బెంగళూరు ట్రాఫిక్ నియంత్రణకు మెగా సొరంగ మార్గం..
- June 29, 2023
బెంగళూరు: ప్రపంచంలో ట్రాఫిక్ ఇబ్బందుల్ని అత్యంత ఎక్కువ ఎదుర్కొంటున్న నగరాల్లో బెంగళూరు నగరం ఒకటి. పెరిగిన వాహనాలకు రద్దీకి అనుగుణంగా రోడ్ల నిర్మాణం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లడానికి గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే ఈ ట్రాఫిక్ ఇక్కట్లను రూపుమాపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో భారీ సొరంగ రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
బెంగళూరులో ట్రాఫిక్ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు అనుమతులకై కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం తాజాగా ప్రతిపాదనలు పంపింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి బృందం భేటీ అయింది. ఇందుకు సంబంధించి మంత్రి నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో ట్రాఫిక్ తీవ్రమైన సమస్యగా మారుతోందని, ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పుతో సాధ్యం కావడం లేదని ప్రత్యామ్నాయమైన సొరంగ మార్గం ఏర్పాటు చేయదలిచామని మంత్రి సతీష్ జార్కిహోళి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..