హైదరాబాద్ లో మరో భారీ మోసం..
- June 29, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఆదాయపు పన్ను శాఖ పన్ను రీఫండ్ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. 40 కోట్ల రూపాయల స్కామ్ ను ఐటీ అధికారులు బయటపెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ముందస్తుగా కంపెనీల వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. అదనపు కన్సల్టెంట్‌లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను గుర్తించారు.
నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ స్కామ్ లో కన్సల్టెంట్లు, ఉద్యోగులను ఉన్నారని ఐటీ అధికారులు తెలిపారు. కన్సల్టెంట్‌లు, ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం రిటర్న్‌లను దాఖలు చేశారు. 2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించింది.
తాజా వార్తలు
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..