మహిళను ఢీకొట్టిన డ్రైవర్. 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని ఆదేశం

- June 30, 2023 , by Maagulf
మహిళను ఢీకొట్టిన డ్రైవర్. 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని ఆదేశం

యూఏఈ: రెడ్ లైట్ నిబంధనను ఉల్లంఘించి, వాహనంతో ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లిన  అరబ్ యువకుడి జైలు శిక్ష పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. కేసును విచారించిన ఖోర్ ఫక్కన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ Dh5,000 జరిమానా, Dh200,000 బ్లడ్ మనీని వ్యక్తిగతంగా లేదా ప్రమాదానికి గురైన వాహనానికి బీమా చేసిన కంపెనీతో కలిసి చెల్లించాలని ఆదేశించింది.  రెడ్ లైట్ సిగ్నల్ పడ్డ సమయంలో జంక్షన్ వద్ద  వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు. ప్రమాదవశాత్తు బాధితుల మరణానికి/గాయానికి కారణమైనందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్టికల్స్ (88), (87) నిబంధనల ప్రకారం, డ్రైవర్‌ను ఏడాది పాటు జైలులో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలు వారసులకు 200,000 దిర్హామ్‌ల చట్టబద్ధమైన రక్త ధనం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు తీర్పుపై అప్పీల్ చేయగా, అప్పీల్‌ను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com