వాట్సాప్ డెస్క్‌టాప్‌లో అదిరే ఫీచర్..
- June 30, 2023
ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా-యాజమాన్యమైన వాట్సాప్ విండోస్ డెస్క్‌టాప్ యాప్‌లో మెరుగైన ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు గరిష్టంగా 32 మంది వ్యక్తులతో వీడియో, ఆడియో కాల్లలో పాల్గొనవచ్చు. గతంలో, డెస్క్‌టాప్ అప్లికేషన్ గ్రూప్ వీడియో కాల్స్ గరిష్టంగా 8 మంది యూజర్లు పాల్గొనేందుకు అనుమతించింది.
కానీ, 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్లకు సపోర్టు ఇచ్చింది. అయితే, వాట్సాప్ ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో గ్రూప్ వీడియో కాల్ పరిమితిని పెంచింది. WABetaInfo ప్రకారం.. వాట్సాప్ 32 మంది యూజర్లకు వీడియో కాలింగ్‌ను అనుమతించే ఫీచర్‌ను క్రమంగా లాంచ్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో బీటా అప్డేట్ 2.23.24.1.0ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
WABetaInfo ద్వారా షేర్ చేసిన స్క్రీన్‌షాట్.. ఎంపిక చేసిన బీటా టెస్టర్లు గ్రూప్ కాలింగ్‌ను చేసుకునేందుకు ఇన్విటేషన్ అందుకోవచ్చు. 32 మంది పాల్గొనేవారికి సపోర్టుతో నేరుగా విండోస్ యాప్ నుండి కాంటాక్టులు, గ్రూపులు రెండింటికీ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. నివేదిక ప్రకారం.. నిర్దిష్ట వినియోగదారులు గరిష్టంగా 16 మంది వ్యక్తులతో వీడియో కాలింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఈ ఫంక్షనాలిటీ వీడియో కాల్లలో స్క్రీన్ కంటెంట్‌ను షేర్ చేసే ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది. గతంలో Windows 2.2322.1.0 అప్డేట్ వాట్సాప్ బీటాతో ప్రకటించింది. అంతేకాకుండా, ఇటీవలి యాప్ అప్డేట్ను ఇన్స్టాల్ చేయగా.. కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే వీడియో మెసేజ్‌లకు యాక్సెస్ అందించింది.
వాట్సాప్ మెసేజ్ పిన్ డ్యురేషన్ అనే కొత్త ఫీచర్‌పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. (Google Play Store)లో అందుబాటులో ఉన్న Android 2.23.13.11 అప్డేట్ వాట్సాప్ బీటాలో గుర్తించారు. మెసేజ్ పిన్ డ్యురేషన్ ఎలా పని చేస్తుంది? చాట్‌లో మెసేజ్ ఎంతకాలం పిన్ చేయాలో వినియోగదారులు ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుందని నివేదిక పేర్కొంది.
పిన్ చేసిన మెసేజ్ ఆటోమాటిక్‌గా అన్‌పిన్ చేసిన తర్వాత నిర్దిష్ట వ్యవధిని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం 3 వేర్వేరు వ్యవధులను అందిస్తుంది. 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు, యూజర్లను ఎంచుకోవడానికి సూచిస్తుంది. వినియోగదారులకు పిన్ చేసిన మెసేజ్‌లపై ఎక్కువ సౌలభ్యాన్ని కంట్రోల్ అందిస్తుంది. ప్రస్తుత పిన్ చేసిన మెసేజ్ ఏ సమయంలోనైనా అన్‌పిన్ చేసే అవకాశం యూజర్లకు ఉంటుందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







