హజ్ చేసిన దేశాధినేతలకు రిసెప్షన్ ఇచ్చిన క్రౌన్ ప్రిన్స్

- June 30, 2023 , by Maagulf
హజ్ చేసిన దేశాధినేతలకు రిసెప్షన్ ఇచ్చిన క్రౌన్ ప్రిన్స్

మినా: ఈ ఏడాది హజ్ యాత్ర చేసిన దేశాధినేతలు, ఇస్లామిక్ ప్రముఖులు, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుల అతిథులు, ప్రభుత్వ సంస్థలు, ప్రతినిధి బృందాలు మరియు యాత్రికుల వ్యవహారాల కార్యాలయాల అధిపతుల కోసం క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ గురువారం వార్షిక రిసెప్షన్‌ను నిర్వహించారు. మక్కాలోని మినా ప్యాలెస్‌లోని రాయల్ కోర్ట్‌లో నిర్వహించిన రిసెప్షన్ లో మలేషియా రాజు అల్-సుల్తాన్ అబ్దుల్లా రియాతుద్దీన్ అల్-ముస్తఫా బిల్లా షా, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్, మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఫైసల్ నసీమ్ తదితరులు పాల్గొన్నారు.  వీరితో పాటు ఈజిప్ట్ ప్రధాన మంత్రి, డాక్టర్ ముస్తఫా మద్బౌలీ, లెబనాన్ ప్రధాన మంత్రి నజీబ్ మికాటి, సోమాలియా ప్రధాన మంత్రి హమ్జా అబ్ది బర్రే, నైజర్ ప్రధాన మంత్రి ఔహౌమౌడౌ మహమదౌ, పాలస్తీనా ప్రధాన మంత్రి మొహమ్మద్ ఇబ్రహీం ష్టయ్య, మరియు ప్రతినిధుల సభ స్పీకర్లు అనేక ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యాత్రికులు తమ ఆచార వ్యవహారాలను పూర్తి చేసి క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com