Dh250,000 గడియారాన్ని సముద్రం నుంచి తీసి పర్యాటకుడికి అందజేసిన దుబాయ్ పోలీస్
- June 30, 2023
దుబాయ్: UAE జాతీయుడు హమీద్ ఫహద్ అలమేరి, అతని స్నేహితులు దుబాయ్‌లోని పామ్ జుమేరా నుండి ఒక యాచ్‌లో విహారయాత్రకు వెళ్లారు. సముద్ర యానాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు వారిలో UK నుండి వచ్చిన అలమేరి మిత్రుడు తన విలువైన Dh250,000 విలువైన రోలెక్స్ వాచ్‌ను సముద్ర నీటిలో పోగొట్టుకున్నారు. వెంటనే అలమేరి నీటిలోకి డైవ్ చేసాడు. కానీ ఫలితం లేదు. నీళ్ల లోతును పరిశీలిస్తే, గడియారాన్ని తిరిగి పొందడం అసాధ్యం అనిపించింది. కానీ అలమేరి అవకాశం తీసుకుని దుబాయ్ పోలీసుల నంబర్‌కు డయల్ చేశాడు. నిమిషాల వ్యవధిలో, దుబాయ్ పోలీసుల డైవర్ల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. 30 నిమిషాల్లో వారు దానిని "సముద్రం" దిగువన ఉన్న వాచ్ ని గుర్తించారు. పోయిన విలువైన వాచ్ ను తెచ్చి ఇచ్చినా దుబాయ్ పోలీసులకు అలమేరి మరియు అతని స్నేహితులు కృతజ్ఞతలు తెలిపారు. "అత్యుత్తమ పోలీసు సేవ, మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాము!" అలమేరి బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







