శర్వానంద్,లావణ్య త్రిపాఠి కాంబినేషన్ తో 'జోడీ కుదిరింది' చిత్రం
- May 13, 2016
రన్‌రాజారన్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలతో ఆకట్టుకొన్నాడు శర్వానంద్. భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో విజయాలు అందుకొంది లావణ్య త్రిపాఠి. ఇప్పుడు వీళ్లిద్దరికీ జోడీ కుదిరింది. శర్వానంద్ కథానాయకుడిగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చంద్రమోహన్ దర్శకుడు. కథానాయికగా లావణ్యని ఎంచుకొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కించిన 'డార్లింగ్' చిత్రానికి సహాయకుడిగా పచేసిన చంద్రమోహన్ చెప్పిన కథ బాగా నచ్చింది. అతన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జూన్ 1 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. రతన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: భోగవల్లి బాపినీడు. కాంబినేషన్ తో
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







