చర్మం పొడిబారిపోతోందా? పరిష్కారమిదిగో!
- June 23, 2015
వేసవిలోనూ, చలికాలంలోనూ కూడా కొందరికి చర్మం పొడిబారిపోయి దురద, దద్దుర్లు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఇబ్బందిని ఎదుర్కోవాలంటే స్నానం చేసే నీళ్లలో రెండు చుక్కల కొబ్బరినూనె వేసినా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు వేసి మరగబెట్టి, గోరు వెచ్చగా అయ్యాక ఒంటికి రాసుకోవాలి. ఎక్కువగా చలి కాలంలో చర్మంతో పాటు మాడు కూడా పొడిబారి దురద పెడుతూ ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే కొద్దిగా కొబ్బరి నూనెలో రెండు చుక్కల వెనిగర్ వేసి ఆ మిశ్రమాన్ని దూదితో తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో అంతే పరిమాణంలో బొప్పాయి గుజ్జుని కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికీ, జుట్టుకీ రాసుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ పెరిగి తాజాగా కనిపిస్తుంది. మరియు దురద, దద్దుర్ల సమస్య కూడా తీరుతుంది. వీటన్నిటితోపాటూ వాడే సబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మీ శరీరానికి ఏ సబ్బు సరిపోతుందో తెలుసుకుని, దాన్ని మాత్రమే వినియోగించాలి. మార్కెట్లో దొరికే కొత్త కొత్త సబ్బుల్ని ఉపయోగించాలనే సరదాని పక్కనపెడితే, శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







