‘గుంటూరు కారం’ జోరందుకున్న షూటింగ్.!

- July 01, 2023 , by Maagulf
‘గుంటూరు కారం’ జోరందుకున్న షూటింగ్.!

మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో రకరకాల అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది సినిమా ఆగిపోయిందన్నారు. 
ఒక్కొక్కరుగా టెక్నీషియన్లు ప్రాజెక్టు నుంచి అవుట్ అయిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారాలన్నింటినీ ఖండించుకుంటూ వచ్చింది చిత్ర యూనిట్.
హీరోయిన్ పూజా హెగ్ధే అయితే, అవుట్ అయిపోయిన మాట వాస్తవమే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
ఇక, ప్రస్తుతం షూటింగ్ పనులు జోరందుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘గుంటూరు కారం’, మూడో షెడ్యూల్ షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది. 
వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. ఏది ఏమైనా ఆ ప్లానింగ్‌లో ఎలాంటి మార్పు రాకూడని టీమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఎలాగైనా ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నదే గురూజీ, మహేష్ యోచన. ఆ దిశగానే షూటింగ్ పనులు వేగంగా పూర్తి చేసి, నిర్మాణానంతర పనులు మొదలెట్టబోతున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com