గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో రైల్..
- July 01, 2023
హైదరాబాద్: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్‌న్యూస్ తెలిపింది. స్టూడెంట్ పాస్ ఆఫర్ ను ప్రకటించింది. పే లెస్, ట్రావెల్ మోర్ పేరిట ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. 20 ట్రిప్పులకు మాత్రమే మెట్రో రైలు ఛార్జీలు చెల్లించి, 30 ట్రిప్పుల ప్రయాణం చేయొచ్చని పేర్కొంది.
ఇందుకోసం కొత్త స్మార్ట్ కార్డు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. స్టూడెంట్ పాస్ తీసుకోవడానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రెడ్ లైన్ మార్గంలోని జేఎన్టీయూ కళాశాల, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్ సుఖ్ నగర్ స్టేషన్లలో పాస్ కొనుగోలు చేయొచ్చు.
గ్రీన్ లైన్ మార్గంలో కొనుగోలు చేయాలంటే నారాయణగూడలో కార్డును తీసుకోవాలి. బ్లూ లైన్ మార్గంలో కొనుగోలు చేయాలంటే నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయదుర్గ్ వద్ద పాసులు తీసుకోవాలి. విద్యార్థులు పాస్ దరఖాస్తు, బోనో ఫైడ్ సర్టిఫికెట్ పై సంతకం కోసం (STUDENT Pass Application form and Bonafide Certificate) https://www.ltmetro.com/super-saver-offer/metrostudentpass/పై క్లిక్ చేయొచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!
- ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- సౌదీలో 18శాతం పెరిగిన దేశీయ పర్యాటక వ్యయం..!!
- హైదరాబాద్‌లో అల్లూ సినిమాస్ కొత్త డాల్బీ థియేటర్
- ఆఫీస్ తరువాత ఫోన్ కాల్స్, మెయిల్స్‌ను ఉద్యోగులు పట్టించుకోకండి..
- జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా







