శ్రీవారి భక్తులకు శుభవార్త..
- July 02, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు (TTD)టీటీడీ శుభవార్త తెలిపింది. స్థానిక ఆలయాలతోపాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ చెల్లింపులకు టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు(ఆన్ లైన్) ద్వారా చెల్లించేందరుకు చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ఆయన శనివారం ఆయా ఆలయాల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
టీటీడీ వెబ్ సైట్, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్థానిక ఆలయాల్లో కళ్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.
ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డీఎఫ్ వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపేట వేయాలని అధికారులను సూచించారు. ఆలయాల్లో యూపీఏ చెల్లింపుల ఏర్పాటుపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!