కువైట్‌లో డ్రైవర్ ప్రమాదకరమైన స్టంట్ వీడియో వైరల్
- July 02, 2023
కువైట్: రహదారిపై ప్రమాదకరమైన స్టంట్‌ను ప్రదర్శించి నిర్లక్ష్యంగా వ్యవహారించిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు కువైట్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అతని ప్రాణాలతోపాటు స్టంట్ చేయడం వల్ల ఇతరులకు ప్రమాదం ఉందని పేర్కొంటూ.. గల్ఫ్ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సదరు వీడియోను షేర్ చేసింది. కువైట్ అధికారులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనం నడిపితే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!