యాత్ర 2 అనౌన్స్ టీజర్ లీక్..
- July 02, 2023
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. 2019 ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో కనిపిస్తూ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహీ వి రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకు రాబోతున్నట్లు, అది కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ కథతో రాబోతుందని తెలిసి ప్రతి ఒకరిలో ఆసక్తి మొదలైంది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మూవీని అధికారికంగా అనౌన్స్ చేసి మూవీ వివరాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. అయితే ఇంతలోనే ఆ అనౌన్స్ మెంట్ పోస్టర్ అండ్ టీజర్ నెట్టింట లీక్ అయ్యి మేకర్స్ కి షాక్ ఇచ్చింది. ఆ అనౌన్స్ మెంట్ టీజర్ లో.. యానిమేటెడ్ జగన్ నడుస్తూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వస్తుంటుంది. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ జగన్ వాయిస్ ఓవర్ తో టీజర్ రన్ అయ్యింది.
ఇక ఈ టీజర్ చూసిన ఆడియన్స్ అదిరిపోయింది అంటున్నారు. కాగా ఈ సినిమాని V సెల్యులాయిడ్స్ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. ప్రాజెక్ట్ K కి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ వైఎస్ జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తి అవుతుందని గతంలోనే దర్శకుడు తెలియజేశాడు. ఈ సినిమాలో జగన్ పాత్రని తమిళ్ హీరో జీవా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







