పిల్లల పాస్‌పోర్ట్‌లను స్టాంపింగ్ కొసం ప్రత్యేక ఏర్పాట్లు
- July 02, 2023
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పిల్లలకు సేలం, సలామా అలాగే దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్‌తో సంబంధం ఉన్న మస్కట్‌లుగా ఉన్న మోడేష్, డానాలతో సహా ప్రసిద్ధ స్థానిక కార్టూన్ పాత్రల బృందం సాదరంగా స్వాగతం పలికింది. పిల్లలను విమానం డోర్ నుండి ఎస్కార్ట్ చేసి, పాస్‌పోర్ట్ కౌంటర్‌ల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారి పాస్‌పోర్ట్‌లను తామే స్టాంప్ చేసే ఏకైక అవకాశం కల్పించారు. కార్టూన్ పాత్రలతో పాటు ఫోటోగ్రాఫ్‌లు మరియు వీడియోలకు పోజులివ్వడంతో వారికి చిరు హుమతులను అందజేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా సంతోషకరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తెలిపింది. పిల్లల కోసం ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్ కొనసాగుతుందని, ఇది దుబాయ్ వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నందున సందర్శకులందరికీ ఆతిథ్యాన్ని అందించడం తమ బాధ్యతని GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!