కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- February 11, 2026
కెనడాలో ఘోరం జరిగింది. బ్రిటిష్ కొలంబియాలోని పీస్ ప్రాంతంలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. 25 మందికి గాయాలయ్యాయి. నిందితుడు కూడా తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం గోధుమ రంగు జుట్టు కలిగిన వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. ఘటనాస్థలిలో 8 మంది చనిపోగా.. సమీపంలోని ఇంటి దగ్గర మరో ఇద్దరు చనిపోయారు. మొత్తంగా 10 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో జరిగినట్లుగా వెల్లడించారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







