BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- February 11, 2026
న్యూ ఢిల్లీ: విద్యుత్ తయారీ పరికరాలు, ఇంజనీరింగ్ సేవల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో మోడీ సర్కార్ ఐదు శాతం వాటాలను విక్రయిస్తోంది. బుధవారం ఇన్స్‌ట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.5600 కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు వేశారు. ఇది రెండు రెట్లు ఎక్కువ. సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి 12న బిడ్లు వేసేందుకు అవకాశం కల్పించారు. గ్రీన్‌షు అప్షన్, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) సెక్రటరీ అరునిష్ చావ్లా తెలిపారు. తొలి రోజు ఒఎఫ్‌ఎస్‌కు 2.3 రెట్ల స్పందన వచ్చిందని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఒక్కో షేర్‌ను రూ.254 వద్ద విక్రయించడం ద్వారా రూ.4,422 కోట్లు కేంద్ర ఖజానాకు చేరనున్నాయి. ఈ మొత్తం విలువ చేసే వాటాలు ప్రయివేటు శక్తుల సొంతం కానున్నాయి. మొత్తంగా 5 శాతానికి సమానమయ్యే 17.41 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం భెల్‌తో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. వాటాల ఉపసంహరణ తర్వాత ఇది మరింత తగ్గిపోనుంది.
వాటాల విక్రయ పరిణామంతో బుధవారం భెల్ షేర్ 5.58 శాతం పడిపోయి రూ.260.65 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో భెల్ నికర లాభాలు 190 శాతం వృద్ధితో రూ.390.40 కోట్లుగా నమోదయ్యాయి. సంస్థ ఆదాయం కూడా 16.4 శాతం పెరిగి రూ.8,473 కోట్లకు చేరింది. గడిచిన ఆరు నెలల్లో భెల్ షేర్ ఇన్వెస్టర్లకు దాదాపు 25 శాతం లాభాలను అందించింది. ఏడాది కాలంలో ఏకంగా 38 శాతానికి పైగా వృద్ధిని కనబరచడం విశేషం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







