నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- February 11, 2026
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ State Bank of India (SBI) షేర్ మార్కెట్లో సరికొత్త మైలురాయిని చేరుకుని పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ అందించింది. బుధవారం ఎన్ఎస్ఈలో షేర్ ధర 3.8 శాతం పెరిగి రూ.1,187కు చేరి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ.38,000 కోట్లకు పైగా పెరిగి రూ.10.94 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలతో ఎస్బీఐ దేశంలో నాల్గవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించి టీసీఎస్‌ను అధిగమించింది.
ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 10.5 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ షేర్ ధర 2024, ఆగష్టు 30న నమోదైన రూ. 4,552 ఆల్‌టైమ్ రికార్డు గరిష్ఠం నుంచి 36 శాతం పడిపోయి, బుధవారం రూ. 2,909 వద్ద ఉంది. ఇక, ఎస్బీఐ కంటే ముందు, దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రూ. 19.87 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత హెచ్ఎఎఫ్సీ బ్యాంక్(రూ. 14.26 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 11.5 లక్షల కోట్లు) అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







