అమెరికాలో పరిటాల శ్రీరామ్‌ స్పీచ్‌...యువతలో ఉత్సాహం

- July 04, 2023 , by Maagulf
అమెరికాలో పరిటాల శ్రీరామ్‌ స్పీచ్‌...యువతలో ఉత్సాహం

 అమెరికా: తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌ పర్యటనను పురస్కరించుకుని డిట్రాయిట్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఫర్మింగ్టన్‌లోని రావుగారి విందు కుజిన్‌ బార్‌ అండ్‌ బాంక్వెట్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడిపి అభిమానులు, పరిటాల అభిమానులతోపాటు దాదాపు 100 మందికిపైగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ చేసిన ఉత్తేజకరమైన ప్రసంగం ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పాలన వల్ల రాష్ట్ర ప్రగతి బాగా దెబ్బతిందని అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు ఎన్నారైలు గట్టిగా ప్రయత్నించాలని పరిటాల శ్రీరామ్‌ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఎక్కువమంది యువతే ఉండటం విశేషం. కొత్తగా వచ్చిన స్టూడెంట్‌ లతోపాటు, డిట్రాయిట్‌ పరిసర ప్రాంతంలో ఉన్న యువత ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఎన్నారై టీడిపి అభిమానుల్లో ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. రవి గుళ్ళపల్లి అధ్యక్షతన  ఈ కార్యక్రమం విజయవంతానికి సునీల్‌ పంట్ర, కిరణ్‌ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రాం ప్రసాద్‌ చిలుకూరి, ఉమ ఓమ్మి కృషి చేశారు. కెనడా నుంచి సుమంత్‌ సుంకర, అనిల్‌ లింగమనేని, శ్రీరామ్‌ కడియాల, కళ్యాణ్‌ తోపాటు పలువురు టీడిపి అభిమానులు ఇందులో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com