ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
- July 04, 2023
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. మరో ఐదు , ఆరు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతుండడం తో ప్రజలకు మరింత దగ్గ్గర అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఉభయ గోదావరి జిల్లాలో రెండు వారాలపాటు వారాహి విజయయాత్ర చేపట్టారు. ఈ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు.
కొంతకాలం నుండి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబదించిన విషయాలు, రాజకీయ విషయాలు షేర్ చేస్తూ వస్తున్నాడు. ట్విట్టర్‌లో పవన్‌కు 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు. ఇలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి చేరుతున్నారు. అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాలోకి పవన్ అడుగుపెట్టాడట. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు.
పవన్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. అందులో బ్రో మరో నాలుగు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటుగా సుజీత్‌తో ఓజీ, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ చేస్తున్నాడు. ఇక క్రిష్‌తో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.
తాజా వార్తలు
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు







