తగ్గిన పసిడి ధర
- May 14, 2016
బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గింది. రూ.25 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.30,025కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో ధర పెరుగుతున్నప్పటికీ దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కీలక సమయాల్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.76శాతం పెరిగి 1,272.80 అమెరికన్ డాలర్లకు చేరింది.
అయితే శనివారం వెండి ధర మాత్రం చెప్పుకోదగ్గరీతిలో పెరిగింది. ఈ ఒక్కరోజే రూ.425 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,925కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







