మెగా డబుల్ ధమాకా.! ఒకే స్క్రీన్ పై అన్నదమ్ములిద్దరూ.!

- July 05, 2023 , by Maagulf
మెగా డబుల్ ధమాకా.! ఒకే స్క్రీన్ పై అన్నదమ్ములిద్దరూ.!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా వుంటుంది.? గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఈ కాంబోని కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ పై చూశాం. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం కోసం ఎంత ప్రయత్నించినా ఇంతవరకూ జరగలేదు.

కానీ, ఇప్పుడు అందుకు అవకాశమొచ్చిందా.? అంటే ఒకింత అవుననే చెప్పాలి. ఒకే స్క్రీన్ పై ఈ ఇద్దరూ కనిపించే అవకశాశముంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్. ఒకే స్క్రీన్ పై కనిపిస్తారు. కానీ, కలిసి కాదు. ఏంటా ట్విస్ట్ అనుకుంటున్నారా.?

ఈ నెల 28న ‘బ్రో’ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇదే రోజు, ఈ సినిమా రిలీజ్ కాబోయే ధియేటర్లలోనే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు.

అలా ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఒకే ధియేటర్లో ఇద్దరు అభిమాన హీరోల్ని ఒకేసారి చూసే అవకాశం.. మెగా అభిమానులకు ఇది నిజమైన పండగే కదా. మెగా డబుల్ ట్రీట్ అంటే ఇదే మరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com