షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత.? సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందా.?

- July 05, 2023 , by Maagulf
షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత.? సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందా.?

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న సమంత నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. సమంత తాను ఒప్పుకున్న సినిమాలకు అడ్వాన్స్ తిరిగిచ్చేస్తోందట అనేది ఆ షాకింగ్ న్యూస్. అంటే, సమంత సినిమాలకు దూరమైపోతోందన్నదే ఆ న్యూస్ సారాంశం.

‘యశోద’ సినిమా టైమ్‌లో సమంత ఆనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘శాకుంతలం’ సినిమాని ఎలాగో కష్టపడి పూర్తి చేసింది. కానీ, ఈ రెండు సినిమాల రిజల్ట్ సమంతకు అనుకూలంగా రాకపోవడంతో, ఆమె గ్రాఫ్ కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. 

కానీ, సమంత ఇప్పుడూ అప్పుడూ ఎప్పుడూ స్టార్ సెలబ్రిటీనే. సమంతకు సంబంధించిన ఏ న్యూస్ అయినా అదో సెన్సేషనే. అయితే, తాజాగా సమంత సినిమాలకు దూరమవుతోందట అనే న్యూస్ మాత్రం ఇటు ఫ్యాన్స్ కానీ, అటు సినీ వర్గాలు కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయ్.

సమంత ప్రస్తుతం ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. అలాగే, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. ఈ రెండూ కాక మరే కొత్త ప్రాజెక్ట్ పైనా సమంత సైన్ చేయలేదు. తన పర్సనల్ లైఫ్‌లో దృష్టి పెట్టడం కోసమే కొన్నాళ్ల పాటు సమంత సినిమాలకు దూరంగా వుండాలని అనుకుంటోందట. 

ఆ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులేమీ ఒప్పుకోకూడదని నిర్ణయించుకుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com