నిహారిక విడాకులు.! ఇట్స్ ఏన్ అపీషియల్.!
- July 05, 2023
మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారంపై గత కొంత కాలంగా వస్తున్న ప్రచారానికి తెర పడింది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తాజాగా హైద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
2020 డిసెంబర్ లో రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నిహారిక, చైతన్యలు పరస్పర అభిప్రాయ బేధాలతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై పలు వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టగా ఎవ్వరూ స్పందించలేదు ఈ అంశంపై.
తాజాగా విడాకులు కన్‌ఫామ్ చేస్తూ అధికారికంగా న్యూస్ వెల్లడించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా వున్న నిహారిక, ఇటీవలే ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ యాక్టింగ్‌పై స్కోప్ పెట్టింది.
ఇకపై సినిమాల్లో వరుసగా నటించాలనుకుంటోందన్న సంకేతాలు కూడా పంపిస్తోంది. కారణాలేమైనా ఇరువురు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడితో, నిహారిక విడాకుల ప్రచారానికి చెక్ పడ్డట్లే.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







