అల్ అష్ఖారాలో పర్యాటక కార్యకలాపాలు ప్రారంభం

- July 06, 2023 , by Maagulf
అల్ అష్ఖారాలో పర్యాటక కార్యకలాపాలు ప్రారంభం

ఒమన్: అల్ అష్ఖారా పబ్లిక్ పార్క్‌లో హెరిటేజ్, టూరిజం శాఖ మంత్రి సలీం బిన్ మహ్మద్ అల్ మహ్రూఖీ ఆధ్వర్యంలో అల్ అష్ఖారా వాతావరణ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సందర్శకులను ఆకర్షించడానికి ఇది తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగావారు పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా వేసవిలో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. ఫోరమ్ స్థానిక పర్యాటకాన్ని మెరుగుపరచడం, జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతోపాటు ఈవెంట్‌ల వైవిధ్యం,  సమగ్రత ద్వారా సాంస్కృతిక మరియు ఆర్థిక అంశాలతో ఏకీకృతం చేయడానికి, పర్యాటక కార్యకలాపాలను కొనసాగించడానికి శాశ్వత సైట్‌లను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు  వినోదం, బీచ్ గేమ్స్ కార్నర్, సాంస్కృతిక, ఇతర కార్యకలాపాలు ఉంటాయని, గాలిపటాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com