వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

- July 06, 2023 , by Maagulf
వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

వర్షా కాలం వస్తుందంటే చాలు.. అనేక రకాల రోగాలు చుట్టుముడుతుంటాయ్. చిటపట చినుకులు తొలకరితో పాటూ, రోగాల్నీ మోసుకొస్తాయ్. సీజనల్‌గా వచ్చే ఈ రోగాల్లో ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత వుంది. 
ఆస్తమా రోగులు ఈ కాలంలో వచ్చే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముందస్తు జాగ్రత్తలు పాఠించాలి.
ముఖ్యంగా తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. చల్లని పానీయాలకు పూర్తిగా దూరంగా వుండాలి.
కాచి చల్లార్చిన నీటినే తీసుకోవడం మంచిది. అలాగే శుభ్రమైన అలెర్జీ ఫ్రీ ఎట్మాస్పియర్‌ని క్రియేట్ చేసుకోవాలి. 
ఇండోర్‌లో తేమ వాతావరణం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే వెంటిలేషన్ కూడా. అలాగే బూజు, అపరిశుభ్రమైన వాతావరణానికి దూరంగా వుంటే మంచిది.
పోషక విలువలున్న ఆహారాన్ని, ఆకుకూరలను ఎక్కవగా తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వేడి వేడిగా వున్న ఆహారాన్ని తింటే మంచిది. పరిసరాల పరిశుభ్రతతో పాటూ, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా చాలా అవసరం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com