సోషల్ మీడియాలో 'ఆక్షేపణీయమైన' వీడియో షేర్.. నివాసి అరెస్ట్

- July 10, 2023 , by Maagulf
సోషల్ మీడియాలో \'ఆక్షేపణీయమైన\' వీడియో షేర్.. నివాసి అరెస్ట్

యూఏఈ: ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే వీడియోను పోస్ట్ చేయడంలో ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేసిందని ఆరోపించబడిన ఒక ఆసియా నివాసిని అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఆమోదించబడిన మీడియా ప్రమాణాలకు విరుద్ధంగా, ఎమిరాటీ సమాజాన్ని అవమానించే కంటెంట్‌ను ప్రచురించినందుకు ఆసియా ప్రవాసుడిపై కేసు నమోదు చేశారు. యూఏఈ అటార్నీ జనరల్ ఆఫీస్‌లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని వీడియో క్లిప్‌ను పరిశీలించిన ఈ చర్యలు తీసుకున్నారు.

వీటియోలో ఏముందంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నివాసి ఎమిరాటీ దుస్తులు ధరించి విలాసవంతమైన కార్ షోరూమ్‌లోకి వెళ్లాడు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించారు. షోరూమ్ యజమానితో అతను 2 మిలియన్ దిర్హామ్‌ల కంటే ఖరీదైన కారును కొనమని గర్వంగా అడుగుతాడు. అతను షోరూమ్ ఉద్యోగులకు డబ్బుకు విలువ ఇవ్వని విధంగా, ఎమిరాటీ పౌరుల అవమానకరమైన ఇమేజ్‌ను ప్రచారం చేస్తూ, వారిని ఎగతాళి చేసే విధంగా పెద్ద మొత్తంలో నగదును కూడా ఇస్తున్నట్లు చూపించారు. ఇది ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించి, రెచ్చగొడుతుందిని అధికారులు తెలిపారు. యూఏఈలోని సోషల్ మీడియా వినియోగదారులను వారు ప్రచురించే మీడియా కంటెంట్‌లో చట్టపరమైన, నైతిక నిబంధనలను పాటించాలని, సమాజం సామాజిక లక్షణాలు, పొందుపరిచిన విలువలను పరిగణనలోకి తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com