స్కాట్లాండ్ లో ఘనంగా మొట్టమొదటి అష్టావధానం
- July 11, 2023
స్కాట్లాండ్: ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లోని, అచ్చం తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరంలో, అంగరంగ వైభవంగా మొట్టమొదటి అష్టావధానం శ్రీ ప్రణవపీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ చే తేదీ 9 జులై 2023, శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢం, భానువారం రోజున విజయ్ కుమార్ రాజు పర్రి ఘనంగా నిర్వహించారు.
తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందు మందిర్ వేదికయ్యింది. వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుండి కూడా ఏడింబరో విచ్చేసి ఆసక్తిగా తిలకించడం విశేషం.
త్రిభాషా మహాసహస్రావధాని, అవధాన విశ్వగురుబ్రహ్మ, సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి, గౌరవ అతిథులుగా విచ్చేసిన స్కాట్లాండ్తెలుగు సంఘం చైర్మన్ మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేయగా, స్కాట్లాండ్ కు చెందిన గాయకుడు కుమార్ అనీష్ కందాడ గణేశుని ప్రార్థనా గీతం ఆలపించగా కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.
నాగ ప్రసాద్ మంగళంపల్లి గ (సమస్యాపూరణం): వీరి సంధించిన సమస్య చాలా అద్భుతం.
రంజిత్ నాగుబండి (దత్తపది): వీరు సంధించిన నాలుగు పదాలు చాలా రమణీయముగా కలవు.
సాయికుమారి దొడ్డ (వర్ణన): భారతీయుల గొప్పదనాన్ని వర్ణించమని వినూత్న తరహాలో అడిగినట్టి సందర్భం.
శైలజ గంటి (నిషిద్ధాక్షరి): పోటాపోటీగా సాగిన వీరి అక్షర నిషిద్ధం అమోఘం.
హిమబిందు జయంతి (న్యస్తాక్షరి): కీలకమైన స్థానాలలో అక్షరాలను ప్రతిపాదిస్తూ సాగిన క్లిష్టమైన ప్రక్రియ.
అనంత రామానంద్ గార్లపాటి, మమత వుసికల (ఆశువు): వీరి పద్య గద్య సందర్భ ప్రయోగం చాలా వినూత్నంగా చూపరులను ఆకట్టుకొంది.
విజయ్ కుమార్ రాజు పర్రి, మిథిలేష్ వద్దిపర్తి, పండరి జైన్ కుమార్ పోలిశెట్టి(పురాణ పఠనం): ముగ్గురూ ముగ్గురే.. పద్య గాన చాతుర్యమును మూడు విధముల ప్రయోగించడం అన్నది అమోఘం
సత్యశ్యాం కుమార్ జయంతి, నిరంజన్ నూక (అప్రస్తుత ప్రసంగం): వీరి చురుక్కులు, చమక్కులు భలే గమ్మత్తుగా, సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టేలా, నవ్వులు పూయించేలా మరియుఆలోచింపజేసివిగాను వుండడం విశేషం.
ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ కార్యక్రమమునకు విశ్రాంత అధ్యాపకులు డా.అయ్యగారి జగన్నాథ కామేశ్వర ప్రసాద్ అవధాని గారి ధారణా శక్తిని కొనియాడుతూ, పృచ్ఛకుల కార్యదక్షతను ప్రశంసిస్తూ విమర్శనాత్మక విశ్లేషణ చేశారు.
కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్ ని నిర్వాహకులు విజయ్ మరియు పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, కానుకలతో, పూలు పండ్లతోసత్కరించారు.
హిమాలయాల తపోఫలం సిద్ధించినటువంటి త్రిభాషా మహాసహస్రావధానులు, శ్రీ సత్య సాయి బాబా వారు, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు, విశ్వయోగి విశ్వంజీ, వాడే కర్ మహారాజు వంటి మహాపీఠాధిపతులచే అనేక సత్కారాలను పొందినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తామే స్వయంగా స్వహస్తాలతో ఈ 12 మంది పృచ్ఛకులను సత్కరించడం అష్టావధాన చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. మహాఅవధానులు పృచ్ఛకులను సత్కరించడం అరుదైన విశేషం!
‘న భూతో న భవిష్యతి’ అనే విధముగా సాగిన ఈ కార్యక్రమానికి చివరగా నిర్వాహకులు విజయ్ గారు అవధాని కి, పృచ్ఛకులకు, సభికులకు, గౌరవాతిథులు స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ మైథిలికి, సన్మాన పత్ర అక్షరశిల్పి విశ్రాంత బి యస్.యన్.యల్ ఎజియం అయ్యగారి కోదండ రావు కి, పృచ్ఛకులకు తోడ్పాటు నందించిన తల్లాప్రగడ రామచంద్ర రావు కి, హిందు మందిర్ యాజమాన్యం రాజశేఖర్ జాలా కి, వాలంటీర్లకు, నిర్వహణలో సహాయపడిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపగా, వేడుకను మంగళహారతితో సోదరీమణులు శ్రీవిద్య కందాడ,రేఖ దుగ్యాల, రాజి ముగించారు.
ఈ కార్యక్రమానికి రామచంద్ర దుగ్యాల, కృష్ణ జుట్టాడ,అశ్విన్ బక్కచెన్నగారి,సంతోష్ శ్రీరామ,
సంతోష్ తోట,సూర్య కిరణ్,రేవతి సదా,లక్ష్మణ్,వరలక్ష్మి,రమ్య,శ్రీలక్ష్మి ,స్వాతి నాగుబండి,
భార్గవి గునిశెట్టి మరియు వాలంటీర్లుగా కార్తీక్ బొర్ర,జాహ్నవి బొర్ర ,శివ జ్యోతి సంగం,యూనిస్ బైగ్ షేక్,బెంజమిన్ ,అస్మిత కట్టా,హరిణి రెడ్డి మంద,సాయి సుచిత్ రెడ్డి వీరవెల్లి,రీషిక వీరవెల్లి,సాయి కిరణ్,అక్షర షాహిరి,సాయికృష్ణ పారెకర్ సహాయ సహకారాలు అందించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









