కటారా ఆర్ట్, ఆర్కిటెక్చర్, కాలిగ్రఫీ వర్క్‌షాప్‌లు ప్రారంభం
- July 12, 2023
దోహా: కటారాలోని కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ రాబోయే నెలల్లో జరగనున్న ఆకర్షణీయమైన ఆర్ట్, కాలిగ్రఫీ వర్క్‌షాప్‌ల శ్రేణిని ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ నైపుణ్యం కలిగిన బోధకుల మార్గదర్శకత్వంలో వివిధ కళాత్మక పద్ధతులను నేర్చుకోవడానికి, కాలిగ్రఫీ ప్రపంచంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. జూలై 17 నుండి వర్క్‌షాప్‌ల శ్రేణి అధికారికంగా ప్రారంభం అవుతుంది. QR100 రిజిస్ట్రేషన్ రుసుముతో ఇందులో పాల్గొనేవారు జిప్సం ఉపయోగించి అద్భుతమైన పూల శిల్పాలను సృష్టించడం నేర్చుకుంటారు. ఈ వర్క్‌షాప్ త్రీడీ డిజైన్ కళను నేర్చుకునే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.
జూలై 24న హాట్ ఎయిర్ బెలూన్ పేపర్ క్రాఫ్ట్ వర్క్‌షాప్ జరుగుతుంది. అక్కడ హాజరైన వారు తమ స్వంత హాట్ ఎయిర్ బెలూన్ మోడల్లను రూపొందించుకునే అవకాశం ఉంటుంది. వర్క్‌షాప్ రుసుము QR70గా నిర్ణయించారు. ఈ వర్క్‌షాప్ ఈ నెలలోని ప్రతి శనివారం జరుగుతుంది. ఈ ఈవెంట్‌కు రుసుము QR500, 17 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పాల్గొనేవారికి అందుబాటులో ఉంటుంది.
జూలై 26న జరగనున్న స్క్రూస్ అండ్ థ్రెడ్స్ వర్క్‌షాప్‌కు ఆర్టిస్ట్ సారా యాకూబ్ నాయకత్వం వహిస్తారు. ఈ వర్క్‌షాప్ హాజరైన వారికి స్క్రూలు, థ్రెడ్లను ఉపయోగించి కళను రూపొందించడంలో మెళకువలను పొందవచ్చు. రుసుము QR100.
కాలిగ్రాఫర్, ఫైన్ ఆర్టిస్ట్ అమ్మర్ అల్ దసౌకి స్క్వేర్-స్టైల్ కుఫీ ఫాంట్‌ని ఉపయోగించి ఆర్కిటెక్చర్ మరియు కాలిగ్రఫీ ప్యాటర్న్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తారు. ఈ వర్క్‌షాప్ నెలలో ప్రతి ఆది, మంగళవారాల్లో ప్రత్యేకంగా జూలై 16, 18, 23, 25, 30, ఆగస్టు 1 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ వర్క్‌షాప్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు QR500. ఆగస్టు 6 నుండి 8 వరకు అల్హంబ్రా వర్క్‌షాప్ నుండి నమూనాల రూపకల్పన సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









