ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు

- July 12, 2023 , by Maagulf
ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు

చైనా: చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు. చైనా రాయబార కార్యాలయం వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, పనుల కోసం భారతీయ పౌరులకు వీసాలు మంజూరు చేశామని ట్వీట్ చేశారు.

చైనా జాతీయుల పట్ల వీసా పరిమితులను త్వరగా ఎత్తివేయాలని చైనా, భారతదేశం మధ్య ప్రజల రాకపోకలను పునఃప్రారంభించాలని ఎదురుచూస్తున్నాం’’ వాంగ్ జియోజియాన్ మరో ట్వీట్ చేశారు.

2023 మొదటి ఐదు నెలల్లో చైనాకు వెళ్లే భారతీయులకు చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ 60,000 కంటే ఎక్కువ వీసాలు భారతీయులకు 71,600 వీసాలు జారీ చేసినట్లు మేలో ముందుగా వాంగ్ జియాజియాన్ ప్రకటించారు. మూడేళ్లలో తొలిసారిగా భారత్‌తో సహా విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని మార్చిలో చైనా ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com