‘బేబీ’గా వైష్ణవి.! అదృష్టం కలిసొస్తే లక్కీ ఛామ్ అయిపోవడం ఖాయమే.!
- July 13, 2023
బుల్లితెర నుంచి పెద్ద తెరకు పరిచయమవ్వడం ఒకప్పటి ట్రెండ్.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి అదే యూ ట్యూబ్ తదితర సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వెండితెరకు ప్రమోట్ కావడం నయా ట్రెండ్.
అలా వెండితెరకు పరిచయమైన తాజా యూ ట్యూబర్ వైష్ణవీ చైతన్య. ‘బేబీ’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. గతంలో వైష్ణవి పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటించింది. తాజాగా ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ అయ్యింది.
ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయ్. వైష్ణవికీ మంచి పేరొస్తుంది. రేపు అనగా జూలై 14న ‘బేబీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోస్టర్లలో చూస్తుంటే వైష్ణవి డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న వైష్ణవి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషన్ అయ్యింది.
తనను నటిగా గుర్తించి, తనలోని నటిని బయటికి తీసుకొచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్‌కి ఎప్పటికీ రుణపడి వుంటానని చెప్పింది. ‘బేబీ’తో తనకు పునర్జన్మనిచ్చిన దర్శకుడు సాయి రాజేష్ అని చెప్పుకొచ్చింది.
నిజమే.! సోషల్ మీడియాలో వైష్ణవి గురించి తెలిసిన వాళ్లకు ఆమె టాలెంట్ తెలిసిందే. ఇక, ఇప్పుడు పెద్ద తెరపై ఆమె టాలెంట్‌కి పదును పెట్టే సమయం వచ్చింది. లక్కు కలిసొచ్చి ఈ సినిమా హిట్ అయితే, వైష్ణవి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







