ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ
- July 13, 2023
పారిస్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లుమోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. అక్కడ విమానాశ్రయంలో దిగుతున్న ఫొటోలు, ఆయనకు గౌరవ వందనం ఇచ్చిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్‌లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితమే మెక్రాన్ ఆహ్వానం పలికారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







