కువైట్ లో VATకి బదులుగా ఎక్సైజ్ పన్ను..!

- July 14, 2023 , by Maagulf
కువైట్ లో VATకి బదులుగా ఎక్సైజ్ పన్ను..!

కువైట్: కువైట్ పన్ను వసూలు కోసం దాని మొదటి ఎంపికగా విలువ ఆధారిత పన్ను (VAT)కి బదులుగా ఎక్సైజ్ పన్ను విధానాన్ని ఆశ్రయించవచ్చని అధికార నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం, కువైట్‌ పార్లమెంటరీ స్థాయిలలో వ్యాట్ బిల్లును తిరస్కరించారు. కనీసం రాబోయే మూడేళ్లలో దాని ప్రణాళికల నుండి ప్రభుత్వం మినహాయించింది. పొగాకు,  దాని ఉత్పన్నాలు, శీతల మరియు తీపి పానీయాలు,  గడియారాలు, నగలు, విలువైన రాళ్లు వంటి విలాసవంతమైన వస్తువులు, అలాగే విలాసవంతమైన కార్లు, పడవలపై ఎక్సైజ్ పన్నును వర్తింపజేయయనున్నారు. ఆయా వస్తువుల విలువ ఆధారంగా  పన్ను 10 నుంచి 25 శాతం వరకు ఉండవచ్చని నివేదికలో తెలిపారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో దాని ఒప్పందం ప్రకారం, కువైట్ వ్యాట్‌ని వర్తింపజేయాలనుకుంటోంది. అయితే పార్లమెంటరీ తిరస్కరణ నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ ఆమోదించడం కష్టమని భావిస్తున్నారు. ప్రతిపాదిత ఎక్సైజ్ పన్ను సంవత్సరానికి KD 500 మిలియన్లను తీసుకువస్తుందని అంచనా వేయబడింది. ఇది తక్కువ,  మధ్య-ఆదాయ ప్రజల ఆదాయాలను ప్రభావితం చేయదని నివేదిక పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com