దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్: అతిపెద్ద పెట్టుబడిదారులు భారతీయులు, బ్రిటన్లు, రష్యన్లు
- July 15, 2023
దుబాయ్: 2023 రెండవ త్రైమాసికంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుల జాబితాలో భారతీయులు, బ్రిటన్లు మరియు రష్యన్లు అగ్రస్థానంలో నిలిచారని బెటర్ హోమ్స్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది. పాకిస్తాన్ పెట్టుబడిదారులు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ అతిపెద్ద కొనుగోలుదారులలో మొదటి పది స్థానాలలో స్థానం పొందారు. బెటర్ హోమ్స్ తన రెండవ త్రైమాసిక నివేదికను విడుదల చేశారు. మహమ్మారి అనంతర కాలంలో భారత ఉపఖండం, యూరప్ మరియు ఇతర ప్రాంతాల నుండి భారీ పెట్టుబడులను యూఏఈ ఆకర్షించింది. ఈ ఏడాది 4,500 మంది మిలియనీర్లను ఆకర్షిస్తుందని అంచనా వేశారు. గత సంవత్సరం 5,200 మంది మిలియనీర్లు యూఏఈకి వలసవచ్చారు. ఎమిరేట్‌లోని రియల్ ఎస్టేట్‌లో అతిపెద్ద పెట్టుబడిదారులలో భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, ఈజిప్ట్, యూఏఈ, టర్కీ, పాకిస్తాన్, ఇటలీ, లెబనాన్, ఫ్రాన్స్‌లకు చెందిన పెట్టుబడిదారులు టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నారని బెటర్ హోమ్స్ తన నివేదికలో తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







