'24' మూవీ పైరసీ బారిన పడిందని...

- May 15, 2016 , by Maagulf
'24' మూవీ పైరసీ బారిన పడిందని...

హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన '24' మూవీ పైరసీ బారిన పడిందని సూర్య కజిన్, నిర్మాత కూడా అయిన జ్ఞానవేల్ రాజా దీక్షకు దిగాడు. బెంగుళూరులోని ఓ థియేటర్‌లో ఈ సినిమా తమిళ వెర్షన్‌ను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని, అయినా దీనిని అడ్డుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.'శుక్రవారం నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా ఇండస్ట్రీ పట్టించుకోలేదని' జ్ఞానవేల్ రాజా వాపోయాడు. అయితే పైరసీ బెడదను నివారించేందుకు ఇండస్ట్రీ పెద్దలు గట్టి చర్యలు తీసుకునేంతవరకూ తాను పోరాడతానని ఆయన అంటున్నాడు. తెలుగులో ఈ చిత్రం బాగానే ఆడుతున్నా తమిళ బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రాజా కలవరపడుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com