1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- March 04, 2026
యూఏఈ: ఇరాన్ తన వైఖరి మార్చుకోవడం లేదని యూఏఈ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 1,000 కి పైగా దాడులు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాల కంటే యూఏఈ నే ఇరాన్ ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొంది.
"యూఏఈ వెయ్యికి పైగా దాడులకు గురైంది. ఈ సంఖ్య ఇతర అన్ని దేశాలు ఎదుర్కొన్న దాడుల మొత్తాన్ని మించిపోయింది. మన సాయుధ దళాలు ఈ దాడులకు అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో ఎదుర్కొంది." అని వెల్లడించింది.
యూఏఈ యుద్ధంలో పాల్గొనలేదని, ఇరాన్‌పై జరిగిన ఏ దాడిలోనూ తన భూభాగం, ప్రాదేశిక జలాలు లేదా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని గుర్తుచేసింది.ఈ విషయాన్ని ఇరాన్ గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.ఉద్రిక్తతలను తగ్గించే విధానాలకు యూఏఈ మద్దతు ఇస్తుందని మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







