2.7 మిలియన్ల ప్రయాణికులతో షార్జా టాక్సీ రికార్డు..!
- July 15, 2023
యూఏఈ: షార్జా టాక్సీ 2023 మొదటి అర్ధభాగంలో 2.7 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసి రికార్డులు సృష్టించింది. సగటున రోజుకు 15,000 మంది ప్రయాణికులు టాక్సీలలో ప్రయాణించారు. ముఖ్యంగా ఈద్ అల్-అధా సెలవుల సమయంలో 102,000 మంది ప్రయాణీకులు టాక్సీలను ఆశ్రయించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 20% అధికం కావడం గమనార్హం. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టాక్సీ వినియోగదారుల సంఖ్య కూడా ఈద్ సందర్భంగా రికార్డు స్థాయికి చేరుకుంది. మొత్తం 23,476 మంది ప్రయాణికులు షార్జా టాక్సీని విమానాశ్రయానికి వెళ్లడానికి , తిరిగి రావడానికి ఉపయోగించారని ఓసూల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ యాక్టింగ్ జనరల్ మేనేజర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ట్యాక్సీ తన వాహనాల్లో 100% పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







