సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లతో లీజ్ ఒప్పందం కుదుర్చుకున్న జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్

- July 17, 2023 , by Maagulf
సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లతో లీజ్ ఒప్పందం కుదుర్చుకున్న జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్

హైదరాబాద్: విమాన ప్రొపల్షన్, ఎక్విప్మెంట్, స్పేస్, డిఫెన్స్ మార్కెట్లలో గ్లోబల్ లీడర్గా ఉన్న సఫ్రాన్ అనుబంధ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఏఈఎస్ఐపీఎల్)తో జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్ (GHASL) ఇటీవలే ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. GHASL జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) 100 శాతం అనుబంధ సంస్థ.  సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ముఖ్య కార్యాలయం ప్యారిస్ , ఫ్రాన్స్ లో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం లీప్ టర్బోఫాన్ ఇంజిన్ల కోసం ఇంజిన్ ఎంఆర్ఓ ఫెసిలిటీని నిర్మించి నిర్వహించేందుకు సఫ్రాన్కు GHASL భూమిని లీజుకు ఇవ్వనుంది.  జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్ పరిధిలో 23.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ విస్తీర్ణం 40 వేల చదరపు మీటర్ల బిల్టప్ స్పేస్ ఉంటుంది.

నిర్మాణం 2023 సెప్టెంబర్లో ప్రారంభమై 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. 2025 లో కార్యకలాపాలు మొదలవనున్న ఈ MRO సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ నెట్వర్క్లోనే అతిపెద్ద సదుపాయం కానుంది. పూర్తి సామర్ధ్యం నాటికి ఎమ్మార్వోలో 1000 మందికిపైగా ఉద్యోగులు ఉంటారు. ఈ సదుపాయం పారిశ్రామిక ప్రక్రియలు మరియు యంత్రాల కోసం సఫ్రాన్ యొక్క అత్యంత కఠినమైన ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది, వీటిలో ఎంఆర్ఓ పరామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ తనిఖీ పద్ధతుల వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉంటాయి. ఈ సదుపాయం 100 శాతం GMR సౌర విద్యుత్పత్తి కేంద్రం నుండి లభించనున్న స్థిరమైన గ్రీన్ ఎనర్జీతో పనిచేస్తుంది.

జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ లోని సెజ్ ప్రాంతంలో కేబుల్ హార్నెసింగ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ భాగాలు తయారీ కోసం సఫ్రాన్ రెండు పారిశ్రామిక సౌకర్యాలను నిర్వహిస్తోంది. అదనంగా, GEతో సఫ్రాన్ యొక్క JV అయిన CFM ఇంజిన్ మెయింటెనెన్స్ శిక్షణ సదుపాయాన్ని నిర్వహిస్తోంది.

జిఎంఆర్ ఏరోస్పేస్ & ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ సిటీ అయిన హైదరాబాద్ ఏరోసిటీ లో ఉంది. ఇది ఎయిర్ పోర్ట్ సిటీస్ యొక్క దశను ముందుకు తీసుకెళుతోంది. విదేశీ మార్కెట్లపై దృష్టి సారించే వ్యాపారాల కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) లోపల భూమిని ఎంచుకునే సౌలభ్యంతో ఈ పార్క్ 'రెడీ టు యూజ్' పారిశ్రామిక మౌలిక సదుపాయాలనేకాక భారతీయ మార్కెట్ను తీర్చే వ్యాపారాల కోసం దేశీయ టారిఫ్ ఏరియాలో భూమిని అందిస్తోంది.

జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్ కపూర్ మాట్లాడుతూ, "సమగ్ర గ్లోబల్ మదింపు తరువాత సఫ్రాన్, జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎంచుకుందని మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజిన్ ఏంఆర్వోలలో ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి లీజు ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ప్లాంట్ ప్రారంభంలో సంవత్సరానికి 100 ఇంజన్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది క్రమంగా 2035 నాటికి 300 ఇంజన్లకు పెరుగుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.”

సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ సపోర్ట్ అండ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నికోలస్ పొటియర్ మాట్లాడుతూ, "హైదరాబాద్ లో మా కొత్త ఎమ్ ఆర్ ఒ షాప్ కు స్థలాన్ని అందించడానికి ఎంపికైనందుకు జిఎంఆర్ కు నా అభినందనలు. భారతదేశంలో మా భవిష్యత్తుకు గణనీయమైన పెట్టుబడి అయిన ఈ ఎంఆర్ఓ ప్రాజెక్ట్, మా ఎయిర్లైన్స్ వినియోగదారుల కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అదనపు కీలక సామర్థ్యాన్ని తెస్తుంది. అంతే కాక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో ఏరోనాటికల్ ఎకోసిస్టమ్ విస్తరణకు కూడా దోహదం చేస్తుంది.” 

జిఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ వాణిజ్య కార్యాలయాలు, రిటైల్, ఏరోస్పేస్ మరియు ఇండస్ట్రియల్ పార్క్, విద్యా సంస్థలు, హాస్పిటాలిటీ, హెల్త్కేర్, ఎంటర్టైన్మెంట్ మరియు రెంటల్ వాసుతుల్లో ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ మిక్స్డ్-యూజ్ మల్టీ-అసెట్ ఎకోసిస్టమ్ను కలిగి ఉంది. ఏరోసిటీ అందించే ప్రత్యేక విలువ ప్రతిపాదనలు ఇప్పటికే అమెజాన్, ప్రాట్ & విట్నీ, సిఎఫ్ఎం, సాఫ్రాన్, ష్నైడర్ ఎలక్ట్రిక్, ఇఎస్ఆర్, ఓఎస్ఐ, షులిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఎన్ఐపిఆర్ఓ, డెకాథ్లాన్, ఇన్వెస్కో మరియు మల్టీసార్బ్తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యాపారాలను ఆకర్షించాయి.

సఫ్రాన్ 19.0 బిలియన్ యూరో టర్నోవర్ మరియు 27 దేశాలలో 83,000 మంది ఉద్యోగుల సంఖ్యను కలిగి ఉన్న 3 ప్రధాన వ్యాపారాలలో (ఏవియేషన్, స్పేస్ మరియు డిఫెన్స్) ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ హై-టెక్నాలజీ గ్రూప్. సఫ్రాన్ యూరోనెక్స్ట్ పారిస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడింది మరియు సిఎసి 40 మరియు యూరో స్టోక్స్ 50 సూచీలలో భాగంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com