తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- May 15, 2016
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలతో సహా తెలంగాణలోని పాలేరు ఉప ఎన్నికకు సోమవారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తమిళనాడులో 232 స్థానాలకు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చెన్నైలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో డీఎంకే చీఫ్ కరుణానిధి, సినీ ప్రముఖులు కమల్ హాసన్, అజిత్ కుమార్, ఖుష్బూ తదితరులు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి జయలలిత స్టెల్లామేరీ కాలేజీలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాల్లో 3,776 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 65వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అరవకురిచి, తంజావూరు స్థానాల్లో అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అక్కడ ఎన్నికలను ఈసీ మే 23కు వాయిదా వేసింది. మే 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు.కేరళలో 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 109 మంది మహిళ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో 344 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేరళలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ, సినీనటుడు, ఎంపీ సురేష్ గోపీ తదితరులు ఓటు వేశారు.తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 243 పోలింగ్ కేంద్రాల్లో 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు మే 19 గురువారం వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







