‘ప్రాజెక్ట్ కె’ అప్డేట్.! దీపికా పదుకొనె ఫస్ట్ లుక్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్.!
- July 18, 2023
ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ లుక్స్‌లో దీపికా సీరియస్‌గా కనిపిస్తోంది.
ఫేస్ ఒక్కటే వైడ్ యాంగిల్‌లో చూపించడం వల్ల దీపిక పాత్ర గురించి కూడా ఎలాంటి అభిప్రాయం రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ప్రాజెక్ట్ కె కోసం జనం చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. ఇంతవరకూ ప్రబాస్ చేసిన ప్యాన్ ఇండియా సినిమాలన్నీ ఓ ఎత్తు. ఈ సినిమా ఒక్కటీ ఇంకో ఎత్తు.. అనేంతలా ‘ప్రాజెక్ట్ కె’ని సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సినిమా మొదటి ప్రచార చిత్రాన్నీ, టైటిల్‌నీ ప్రఖాత్య కామిక్ కాన్ వేదికపై అమెరికాలో జూలై 20న రిలీజ్ చేయనున్నారు.
ఈ వేదికపై రిలీజ్ అవుతున్న తొలి భారతీయ ప్రచార చిత్రంగా ప్రాజెక్ట్ కె హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. జూలై 21న ఇండియాలో ఈ ప్రచార చిత్రం రిలీజ్ చేయనున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు కూడా భాగం కావడం విశేషం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







